Header Banner

ఏపీకి కర్ణాటక కుంకీ ఏనుగులు - పంటలను రక్షిస్తాయన్న పవన్‌ కల్యాణ్‌! నేనే జాగ్రత్తగా చూసుకుంటా..

  Wed May 21, 2025 15:14        Politics

ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ఏరియాల్లో ఏనుగుల వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు శ్రీకాకుళం, సాలూరు ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉందన్నారు. అటవీ భూమిని ఆక్రమించడం వల్ల ఏనుగులే జనవాసాల్లోకి వస్తున్నాయో లేక ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. కానీ ఈ తరహా సమస్యను కర్ణాటక ప్రభుత్వం చాలా పకడ్బందీ ప్రణాళికతో నిరోధిస్తుందని తెలిపారు. అందులో భాగంగా ఈ ప్రభుత్వం చాలా ఏనుగులకు శిక్షణ ఇచ్చిందన్నారు. అంతేకాకుండా అవి ఎలా వ్యవహరించాలో కూడా శిక్షణ ఇచ్చారని చెప్పారు. ఇక ఏనుగులు జనావాసా ప్రాంతంలోకి రాకుండా.. వాటికి ప్రత్యేక మార్గం ద్వారా వెళ్లేలా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా ఆ ప్రాంతంలోని రైతుల భద్రతతో పాటు సురక్షిత చర్యలు తీసుకున్నట్లు అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగులు ఊళ్లలోకి దూసుకు వచ్చి.. పంట పొలాలను నాశనం చేస్తున్న సంగతి తెలిసిందే.

 

ఇది కూడా చదవండి: పంటల మద్దతు ధరలపై మంత్రుల కమిటీ! గత ఏడాదితో పోలిస్తే ఈసారి - 45 నిమిషాలు చర్చ!

 

ఈ దాడుల కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. ఏ సమయంలో ఎటువైపు నుంచి ఏనుగులు దాడి చేస్తాయో తెలియన ఓ విధమైన భయాందోళన పరిస్థితి ఆ ప్రాంత ప్రజల్లో నెలకొంది. అంతేకాకుండా.. ఈ ఏనుగుల దాడి కారణంగా.. పలు గ్రామాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అలాంటి వేళ ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఇలా ఏనుగులు దాడి చేయకుండా ఉండేందుకు కుంకీ ఏనుగులను రంగంలోకి దింపాలని ఆయన నిర్ణయించారు. ఆ క్రమంలో కర్ణాటక ప్రభుత్వంతో గతేడాది సెప్టెంబర్‌లో ఆరు కుంకీ ఏనుగులు ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. బుధవారం రాజధాని బెంగళూరులోని విధాన సౌదాలో సీఎం సిద్దరామయ్యతోపాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆరు కుంకీ ఏనుగులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వారు అప్పగించారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వానికి, సీఎం సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. కుంకీ ఏనుగులు ఏపీకి తీసుకు వస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! ఈ రూట్ లోనే ఫిక్స్ - ఆ నేషనల్ హైవేకు దగ్గరగా.!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli